Gossipsఎఫ్-3 అప్పుడే గొడవలు మొదలయ్యాయా..!

ఎఫ్-3 అప్పుడే గొడవలు మొదలయ్యాయా..!

ఈ సంక్రాంతికి సూపర్ హిట్ బొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఎఫ్-2 సినిమా సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది. ఇప్పటికే 75 కోట్ల కలక్షన్స్ తో దుమ్ముదులిపేసిన ఎఫ్-2 ఇంకా వసూళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ మీట్ లోనే ఎఫ్-3 సినిమా ఎనౌన్స్ చేసి ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచారు. అనీల్ రావిపుడి ఎఫ్-3 కూడా చేస్తాడని అంటున్నారు. అయితే ఇదే టీంతో ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్య దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఎఫ్-3 సినిమాపై ఇంట్రెస్టింగ్ డీటైల్స్ వెళ్లడించారు. s

ఎఫ్-3 సినిమా అదే టీంతో ఉంటుందని చెప్పిన దిల్ రాజు హీరోయిన్స్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే అలా ఎందుకు అన్నాడని ఆరా తీస్తే ఎఫ్-2 సక్సెస్ కావడంతో సినిమాలో నటించిన మెహ్రీన్ కౌర్ రెమ్యునరేషన్ పెంచిందట. ఇన్నాళ్లు సరైన సక్సెస్ లేని మెహ్రీన్ కు ఎఫ్-2 సక్సెస్ మంచి బూస్టప్ ఇచ్చింది. అందుకే ఎఫ్-2 సినిమా విజయాన్ని అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తుంది. కెరియర్ లో కరెక్ట్ టైంలో కరెక్ట్ హిట్ పడటంతో ఇక ఆమె భూమి మీద ఆగట్లేదు. తనతో సినిమా అంటూ వస్తున్న దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ చుక్కలు చూపిస్తుందట.

ఎఫ్-3 సినిమాలో కూడా తాను నటించాలంటే కోరిన రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందిగా కోరిందట మెహ్రీన్ కౌర్. అయితే బడ్జెట్, రెమ్యునరేషన్ విషయాల్లో కరెక్ట్ లెక్కలతో ఉండే దిల్ రాజు మెహ్రీన్ కు ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు సుముఖంగా లేడట అందుకే ఎఫ్-3 చేస్తే ఆమెను కాదని వేరే హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాను మాత్రం 2021 సంక్రాంతికి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news