చరణ్ కోసం గేదలతో తంటాలు పడుతోన్నసమంత !

samantha in rangasthalam

గేదెలను లాగలేక సమంత పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కాదు. సమంత పరిస్థితి చూస్తే అయ్యో పాపం అని అనాల్సిందే. ఎందుకంటే.. ఆమె ఒక రైతు భార్య కనుక. ఇదెంత ఎక్కడా అని సందేహం పడకండి. ఈ సీన్ అంతా రంగస్థలం సినిమాలోది. అందులో సమంత ఒక పల్లెటూరులో రైతు భార్యగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రంగస్థలం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు సుకుమార్ తన ఆలోచనని సమంత రామ్ చరణ్ లపై ప్రయోగిస్తున్నాడు.

సినిమాను ఎన్ని విధాలుగా తియ్యొచ్చో అన్ని విధాలుగా తీయడంలో సుకుమార్ చాలా డిఫ్రెంట్ స్టెల్ మెంటైన్ చేస్తుంటాడు.ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం కనిపిస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న రంగస్థలం సినిమా కూడా అదేవిధంగా చాలా కొత్తగా ఉండబోతున్నట్టు పోస్టర్లే చెబుతున్నాయి. మొన్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో మాస్ గా పక్కా పల్లెటూరు గెటప్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత పోస్టర్ బయటకి వచ్చింది.samantha

ఆ పోస్టర్ లో సమంత గెటప్ చూస్తే అదుర్స్ అనాల్సిందే ఎందుకంటే పక్క పల్లెటూరు గెటప్ లో కనిపించబోతోన్న సమంత ఈ కొత్త గెటప్ లో ఆకట్టుకోవడం ఖాయం. పల్లెటూరిలో రైతు కుటుంబానికి చెందిన అమ్మాయిలు పొలాల వద్ద ఎటువంటి పనులు చేస్తారో అలాంటి పనులను చేస్తూ కనిపించింది. గేదెలను తీసుకువస్తూ.. కట్టెల పొయ్యి వద్ద వంట చేస్తూ చాలా కొత్తగా కనిపించింది.

Leave a comment