సినీ అజ్ఞాతంలోకి పవన్ … ఇక వెండితెరకు దూరమేనా..?

pavan kalyan

సినిమాల్లోనూ , రాజకీయాల్లోనూ పవన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ హీట్ పెంచిన పవన్ దాదాపు ఎన్నికలు అయ్యేవరకు సినిమాలకు దూరం అయ్యే ఛాన్స్ కనబడుతోంది. ఇకపై పవన్‌ కళ్యాణ్‌ నుంచి కొత్తగా సినిమాలు సెట్స్‌ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపించడంలేదు.

త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘అజ్ఞాతవాసి’ సినిమా పవన్‌ కళ్యాణ్‌కి ఆఖరి సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే .. పవన్ ఇక దీర్ఘకాలం సినిమాలకు దూరం అయ్యే ఛాన్స్ అయితే స్ప్రష్టంగా కనిపిస్తోంది.

‘నాలాగా నా తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ చేయడనే అనుకుంటున్నాను. నాకంటే సమర్థుడు పవన్‌కళ్యాణ్‌. సినిమాల్ని, రాజకీయాల్ని బ్యాలన్స్‌ చేసుకోగలడు..’ అని ఓ సందర్భంలో పవన్‌కళ్యాణ్‌ని ఉద్దేశించి, చిరంజీవి గతంలో వ్యాఖ్యానించాడు. అయితేచిరు మాటలను పవన్ తలకెక్కించుకుంటాడో లేదో చూడాలి.

అయినా, పవన్‌ ఏనాడూ సినిమాల్ని సీరియస్‌గా తీసుకోలేదు. ‘ఇక సినిమాలు చేయకూడదు’ అని పవన్‌ చాలా సందర్భాల్లో అనుకున్నాడు. మాట మీద నిలబడే వ్యక్తి కూడా కాదు. అందుకే మాట అనుకుంటాడు.. దాన్ని వెనక్కి తీసుకుంటాడు. సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన ఇష్టం. కానీ రాజకీయాల్లో మాత్రం ఆ పప్పులేమీ ఉడకవు కదా ! ప్రస్తుతం పవన్ వ్యవహారం చూస్తుంటే… కొద్దీ సేపు రాజకీయం కొద్దిసేపు వెండితెర అన్నట్టు ఉంది.

Leave a comment