Gossipsఎన్టీఆర్ కి నంది అవార్డు.. వెనుక అసలు కారణం..

ఎన్టీఆర్ కి నంది అవార్డు.. వెనుక అసలు కారణం..

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఏ హీరోకు రానన్ని హిట్స్ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో చేరాయి. టెంపర్ చిత్రంతో మొదలు పెట్టిన జైత్రయాత్ర నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ నుంచి మొన్న విడుదలైన జై లవకుశ వరకు సాగింది. అంతేకాకుండా తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాడు. బాక్సాఫీస్ ను ఎన్టీఆర్ మామూలుగా కుమ్మ‌ట్లేదు. ఇంటా బ‌య‌టా ఆడేసుకుంటున్నాడంతే. జై ల‌వ‌కుశ‌లో జై మాదిరే ముందూ వెన‌క చూడ‌కుండా క‌సితీరా బాక్సాఫీస్ ను కొల్ల‌గొడుతున్నాడు. ఇండియాలోనే కాదు ఓవ‌ర్సీస్ లోనూ ఇప్పుడు ఎన్టీఆర్ సూప‌ర్ స్టార్.

తాజాగా ప్రకటించిన నంది అవార్డుల్లో కూడా చోటు సంపాదించి యంగ్ టైగర్ అంటే ఏంటో నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్ తో నటించి అందరిని మెప్పించిన
‘జనతా గ్యారేజ్’ చిత్రం ఆయన కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలవడమేగాక అవార్డుల వేటలో కూడా సత్తా చాటింది. 2016లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఏడు నంది అవార్డులను ఖాతాలో వేసుకుంది. గతంలో జరిగిన నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డ్స్, సౌత్ ఇండియా ఫిలిం ఫేర్ అవార్డ్స్, సౌత్ ఇండియా ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుకల్లో పలు విభాగాల్లో అవార్డులను ఈ చిత్రం కైవసం చేసుకుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితాలో కూడా ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, మోహన్ లాల్ లు అవార్డులు గెలుచుకోగా, ఉత్తమ గీత రచయితగా రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో ఏ.ఎస్ ప్రకాష్, ఉత్తమ గీతంగా ప్రణామం ప్రణామం ఎంపికయ్యాయి. దీంతో మొత్తం ఏడు నందులు జనతా గ్యారేజ్ కు దక్కాయి. ఈ అవార్డుల పంటతో ఈ చిత్రం ఎన్టీఆర్, దర్శకు కొరటాల శివల కెరీర్లోనే ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా నిలిచిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news