తారక్ చెర్రీలకు జోడీగా బాలీవుడ్ భామలు

charan and tarak

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీయార్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి నిర్మిస్తున్న ఈ సినిమాకు అప్పుడే వస్తున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతే కాకుండా రాజ‌మౌళి తొలిసారిగా తీయ‌బోతున్న మ‌ల్టీస్టార‌ర్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కుటుంబ క‌థా నేప‌థ్యంతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో చెర్రీ, తారక్ లకు జోడీ ఎవరనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
వీలైనంత తొందరగా షూటింగ్ ప్రారంభించి త్వరగా ముగించేయాలని రాజమౌళి ప్లాన్.
దీనిలో భాగంగానే ఎన్టీఆర్‌, చరణ్‌ల పక్కన నటించబోతున్న హీరోయిన్ ఎంపిక ప్రక్రియలో రాజమౌళి తీరిక లేకుండా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇరువురి హీరోల పక్కన బాలీవుడ్‌ హీరోయిన్లను ఎంపిక చెయ్యాలని జక్కన్న ఆలోచిస్తున్నట్టు సమాచారం. ‘బాహుబలి’ చిత్రాలతో రాజమౌళి పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. దాదాపుగా అన్ని భారతీయ భాషల్లోనూ రాజమౌళి మార్కెట్‌ని సృష్టించుకొన్నారు. దీనికి తగ్గట్టుగా ఆయన సినిమాని తెరకెక్కిస్తే ప్రతి సినిమా కూడా జాతీయ స్థాయిలో విడుదలవడం ఖాయం.

ఎన్టీఆర్‌, చరణ్‌లతో తీస్తున్న చిత్రాన్ని అదే లక్ష్యంతో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ భామల ఎంపికపై రాజమౌళి చాలానే ఆలోచించినట్టు ఉన్నాడు. వీళ్లయితే.. ఈ సినిమా హిందీలో విడుదల చేసినా మంచి మార్కెట్ వస్తుంది అనే ఆలోచనలో జక్కన్న ఉన్నాడు. ఈ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు 150 కోట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు టాప్ స్టార్లు హీరోలుగా నటించడం, అసలు అపజయమే ఎరుగని జక్కన్న ఈ సినిమా నిర్మిస్తుండడంతో భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత వెనుకడుగు వెయ్యడంలేదు.

Leave a comment