పావుగంటకు 14 కోట్లు.. అన్నీ చూపిస్తుందట!

Deepika Padukone Stunning Remuneration For 83

సినిమా హీరోయిన్లు ఒక్కసారి హిట్ అయితే తమ పారితోషకం అమాంతం పెంచేస్తుంటారు. అయితే ఇది కొత్త, పాత హీరోయిన్ అనే బేధం లేకుండా అందరూ చేస్తుంటారు. కానీ కొందరు తమ హాట్ అందాల ఆరబోతకు ప్రత్యేకంగా రెమ్యునరేషన్ పెంచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కేవలం పావుగంట కోసం ఏకంగా రూ.14 కోట్లు పుచ్చుకుంటోంది. అయితే ఈ పావుగంటలో తాను అన్ని చూపిచ్చేస్తాని ఓపెన్‌గా చెబుతోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. ఆమె పావుగంటలో ఏం చూపిస్తోందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మరో ప్రెస్టీజియస్ మూవీ 83 ని దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందిస్తున్నాడు. ఇండియన్ జట్టు 1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కపిల్ దేవ్ పాత్రను హైలైట్ చేస్తూ కబీర్ ఖాన్ ఈ సినిమాను తీస్తున్నాడు. ఇక కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. కాగా కపిల్ దేవ్ భార్య పాత్రలో దీపికా పదుకొనే నటించనుంది. అయితే సినిమాలో ఆమె పాత్ర కేవలం పావుగంట మాత్రమే ఉండనుంది. కానీ ఈ పావుగంటలో అమ్మడు అన్ని రకాల ఎమోషన్స్ పండించనుందట.

మొత్తానికి అంత తక్కువ నిడివి పాత్రలో ఇంత పెద్ద మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవడంతో బాలీవుడ్ వర్గాలు షాక్‌కు గురవుతున్నారు. ఏదేమైనా తన స్టార్ స్టేటస్‌కు తగ్గట్టుగా రెమ్యునరేషన్‌ తీసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment