బాలయ్య దెబ్బకు జంకుతున్న స్టార్ హీరోలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమ కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలను సంక్రాంతికానుకగా రిలీజ్ చేసేందుకు ఈ స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో రానుండగా.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ రానున్నాడు. కాగా వీరి మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియెన్స్ అని ఆయా చిత్ర టీమ్ నుండి తెలుస్తోంది.

కానీ నందమూరి బాలకృష్ణ దెబ్బకు ఈ ఇద్దరు హీరోలు కాస్త జంకుతున్నారు. బాలయ్య కొంత గ్యాప్ తరువాత తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ఇటీవల స్టార్ట్ చేశారు. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు బాలయ్య రెడీ అయ్యాడు. అయితే మహేష్, బన్నీలకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుండటంతో.. ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అని సందేహ పడ్డారు నందమూరి ఫ్యాన్స్. కానీ ఆ హీరోల సినిమాలకు ఏమాత్రం పోటీ లేకుండా పూర్తిగా మాస్ వర్గాలను టార్గెట్ చేస్తూ ఈ సినిమా రానుందని తెలుస్తోంది.

అంటే బాలయ్య తన టార్గెట్‌ను క్లియర్‌గా ఎయిమ్ చేసుకుని పండగ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. ఇక బాలయ్య నుండి పూర్తిగా మాస్ చిత్రం రానుండటంతో బీ,సీ సెంటర్ల ఆడియెన్స్‌ ఊగిపోవడం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఏదేమైనా బాలయ్య సినిమా పండగకు రిలీజ్ అనగానే మహేష్, బన్నీ కాస్త జంకారనే విషయం మాత్రం నిజమంటున్నారు అదే సినీ ఎక్స్‌పర్ట్స్.

Leave a comment