జై లవ కుశ కలెక్షన్స్ పై రగడ రగడ…

debat on jai lava kusa collections

ఎన్టీఆర్జై లవ కుశబాక్స్ ఆఫీస్ వద్ద భీబత్సం సృష్టిస్తుంది . త్రిపాత్రాభినయంతో నట విశ్వరూపం చూపిన ఎన్టీఆర్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.’జై లవ కుశవిడుదలై నాలుగు రోజులు పూర్తి అయి నేటితో ఐదవ రోజులోకి ఈసినిమా ప్రవేసిస్తోంది.సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు వరల్డ్ వైడ్గా ఏకంగా 2400 స్క్రీన్లలో రిలీజ్ చేయడం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది. అయితే ఈసినిమా అత్యంత ఘన విజయం సాధించింది అంటూ నిర్మాత కళ్యాణ్ రామ్ నిన్న ప్రముఖ పత్రికలకు విడుదల చేసిన భారీ ప్రకటనల పై ఇప్పుడు రగడ రేగుతోంది.

 ఈమూవీ మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లు వసూలు చేసింది అంటూ కళ్యాణ్ రామ్ ఇస్తున్న ప్రకటనలు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా పై మిశ్రమ స్పందన రావడంతో పాటు ఈసినిమా ప్రదర్శింపబడుతున్న కొన్ని ఏరియాలలో మార్నింగ్ షో మ్యాట్నీ కలక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రకటనలోని నిజాలు ఎంత అనే విషయం పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతంజై లవ కుశటీమ్ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తూ ఉంటే ఈసినిమా మొదటివారం పూర్తి అయ్యేసరికి 150 కోట్ల కలక్షన్స్ రాబట్టిన సినిమాగా మారింది అంటూజై లవ కుశటీమ్ ప్రకటనలు గుప్పించినా ఆశ్చర్యం లేదు అని సినిమా పండితులు అంటున్నారు. ఇదే జరిగితేజై లవ కుశ‘ ‘బాహుబలిపార్ట్ 1 కలక్షన్స్ తో సమానం అయింది అన్న ప్రచారం జరిగే ఆస్కారం లేకపోలేదు అంటున్నారు .

 జూన్ నెలలో విడుదల అయినదువ్వాడ జగన్నాథంకలక్షన్స్ విషయంలో కూడ చిత్ర బృందం ఇటువంటి భారీ ప్రకటనలు ఇచ్చి ఆసినిమాను నిలబెట్టడానికి చాల ప్రయత్నించారు. అయితే ఆమూవీ రెండవ వారం నుండి కలక్షన్స్ విషయంలో పూర్తిగా ఎదురీత ఈదవలసి వచ్చింది. పరిస్థుతుల నేపధ్యంలోజై లవ కుశకు కూడ ఇప్పడినుండి తొందరపడి కలెక్షన్స్ ప్రకటిస్తే , స్పైడర్  మూవీ రిజల్ట్ తరువాత జై లవకుశ కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా వస్తే అప్పుడు కలెక్షన్స్ ప్రకటిస్తే బాగుంటుంది అంటున్నారు సినీ విశ్లేసకులు .

Leave a comment