Moviesదుమ్మురేపిన ఢీ-10 టి.ఆర్.పి రేటింగ్.. ఎన్టీఆర్ వచ్చాడంటే అంతే మరి..!

దుమ్మురేపిన ఢీ-10 టి.ఆర్.పి రేటింగ్.. ఎన్టీఆర్ వచ్చాడంటే అంతే మరి..!

ఈటివి డ్యాన్స్ షో ఢీ-10 గ్రాండ్ ఫైనల్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చాడని తెలిసిందే. ఫైనల్ విన్నర్ రాజుకి ఎన్.టి.ఆర్ చేతుల మీద ఢీ-10 టైటిల్ అందించారు. అంతేకాదు ప్రైజ్ మనీగా 75 లక్షల మొత్తాన్ని అందించారు. అయితే ఆరోజు బుల్లితెర ఆడియెన్స్ మొత్తం ఢీ నే చూశారని చెప్పొచ్చు. దానికి ఎక్సాంపుల్ ఆరోజు ఢీ-10కి వచ్చిన టి.ఆర్.పి రేటింగ్స్ చెబుతున్నాయి.

బిగ్ బాస్ తో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిన తారక్ మరోసారి దుమ్మురేపాడు. ఢీ షోకి ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రావడం వల్ల ఆరోజు షోకి క్రేజీ టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది. దాదాపు 13.9 టి.ఆర్.పి రేటింగ్స్ తో ఢీ-10 దుమ్ముదులిపేసింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎన్.టి.అర్ 16 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చాడు. అయితే ఒక్కరోజే వచ్చిన్ ఈటివి రేటింగ్స్ బీభత్సంగా పెంచాడు మన తారక రాముడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news