Gossipsరాజమౌళిని తొక్కేస్తున్న కరణ్ జోహార్

రాజమౌళిని తొక్కేస్తున్న కరణ్ జోహార్

బాహుబలి సినిమా కేవలం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయితే అంత పెద్ద సక్సెస్ అయ్యేది కాదు. హిందిలో ఆ సినిమా రిలీజ్ చేయడం వల్ల నేషనల్ వైడ్ గా దానికి క్రేజ్ వచ్చింది. బాహుబలి మొదటి రెండు పార్టులు హిందిలో అంత పెద్ద సక్సెస్ అవడానికి కారణమైన వ్యక్తి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.

సినిమా చూసిన వెంటనే 100 కోట్లతో ఆయన ఆ సినిమాను హిందిలో రిలీజ్ చేశారు. అయితే ఆ 100 కోట్లకు ఆయన ఎన్ని వందల కోట్లు వెనుకేసుకున్నాడో అందరి తెలిసిందే. మొదటి రెండు పార్టులు అసలు నిర్మాతల కన్నా కరణ్ జోహార్ కే ఎక్కువ లాభం వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ మీద కరణ్ జోహార్ కన్ను పడ్డది.

అందుకే ఆ మల్టీస్టారర్ మూవీని హిందిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు. అంతేకాదు సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్విని రిఫర్ చేస్తున్నాడట. హిందిలో కరణ్ హెల్ప్ తప్పదు కాబట్టి రాజమౌళి జాన్వికి అవకాశం ఇవ్వాల్సిందే అంటున్నారు. శ్రీదేవి కూతురు మొదటి సినిమాగా వచ్చిన దడక్ మంచి కలక్షన్స్ సాధిస్తుంది. మరి జాన్వి రాజమౌళి సినిమాలో ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news