కలర్స్ స్వాతీ మళ్లీ మొదలుపెటిందా..!

165

బుల్లితెరపై కలర్స్ ప్రోగ్రామ్ తో ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కలర్స్ స్వాతి తర్వాత హీరోయిన్ గా ‘అష్టాచమ్మా’సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత స్వామిరారా, కార్తికేయ ఇలా పలు తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటించింది.

ఇటీవల ఆమె వివాహం చేసుకున్న తర్వాత సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు. మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వైవాహిక జీవితం హ్యాపీగా ఉంది. అయితే కలర్స్ స్వాతి హీరోయిన్ గా మంచి పొజీషన్లో ఉన్న సమయంలోనే వివాహం జరిగింది. కానీ ఆమెకు ఇప్పటికే మంచి ఛాన్సులు ఇచ్చేందుకు దర్శక, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

తాాజాగా కలర్స్ స్వాతి తన ఆల్ టైమ్ హిట్ కార్తికేయ చిత్రానికి సీక్వెల్ లో నటించనుంది. ఈ మేరకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నిఖిల్ అర్జున్ సురవరం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. చందు గత ఏడాది తెరకెక్కించిన సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈసారి ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తున్నారు. పీపుల్స్ మీడియా ప్యాక్టరీపై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారట.2008లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది.

Leave a comment