మెగా అల్లుడిపై చిరు అసంతృప్తి..!

13

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమా రిలీజ్ అయ్యింది. రాకేష్ శషి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెంటిమెంటల్ ఎమోషనల్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ నటనకు సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. సినిమాకు ముందు కళ్యాణ్ యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాడని తెలిసినా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడని అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందించినా సరే కళ్యాణ్ దేవ్ నటనకు మాత్రం అసంతృప్తి వ్యక్తపరచాడని తెలుస్తుంది. ఓ పక్క తండ్రిగా మురళి శర్మ అదిరిపోయేలా నటించగా ఆయన పక్క కళ్యాణ్ దేవ్ ఏమాత్రం ఆకట్టుకోలేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మెగాస్టార్ కూడా కళ్యాణ్ నటనపై నిరాశను వ్యక్తం చేశాడట.

సాయి కొర్రపాటి నిర్మాణంలో వచ్చిన విజేత సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ డ్రామాగా సాగిన ఈ సినిమాలో అంచనాలను అందుకోలేదని చెప్పొచ్చు.

Leave a comment