Gossipsనెట్ లో వైరల్ అవుతున్న చెర్రీ బోయపాటి మూవీ ఫిక్స్..

నెట్ లో వైరల్ అవుతున్న చెర్రీ బోయపాటి మూవీ ఫిక్స్..

‘రంగస్థలం’ అందించిన కిక్ తో మంచి హుషారుగా ఉన్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో బ్లాక్ బ్లాస్టర్ తో హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. చెర్రీ తో హిట్ కొట్టించేందుకు
మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శ్రీను కష్టపడుతున్నాడు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు రామ్ చరణ్. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌‌లో డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
4

3
ఈ సినిమా షూటింగ్ వైజాగ్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ షూటింగ్ కంటే ముందుగానే … అజర్ బైజాన్ దేశంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా అక్కడ షెడ్యూల్ కు సంబంధించి కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకి రావడంతో పాటు వైరల్ గా మారాయి. ఈ ఫైట్స్ లో
కేవలం మన తెలుగు వారే కాకుండా విదేశీ వారు కూడా ఉన్నట్లు ఆ చిత్రాలు చూస్తుంటే అర్ధం అవుతోంది.
2

1
ఈ మూవీలో చెర్రీ సరసన ‘భరత్ అనే నేను’ హీరోయిన్ కియారీ అద్వానీ జోడీ కడుతుండగా.. తమిళ నటుడు ప్రశాంత్‌, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం.. రిషి పంజాబి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దీపావళికి ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news