Gossipsనవ్వుల దాదా బ్రమ్మి .ఇక కనుమరుగేనా.

నవ్వుల దాదా బ్రమ్మి .ఇక కనుమరుగేనా.

తెలుగు వెండితెర మీద నవ్వులు పంచిన హాస్య బ్రహ్మ నవ్వుల రేడు బ్రహ్మానందం. ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా లేదని చెప్పాలి. స్టార్స్ తో సంబంధం లేదు బ్రహ్మానందం ఉన్నాడా అయితే సినిమా హిట్ అన్న టైం కూడా నడిచింది. అయితే రొటీన్ గా ఆయన అవే పాత్రలు చేయడం వల్ల ఆడియెన్స్ కూడా బోర్ ఫీలయ్యారు.

ఇప్పటికైనా మంచి కామెడీ చేయాలంటే అది బ్రహ్మి వల్లే అనేలా తన టాలెంట్ చూపాడు. మంచి ఫాంలో ఉన్న టైంలో ఒక్క కాల్ షీట్ 5 లక్షల దాకా తీసుకున్న బ్రహ్మానందం ఇప్పుడు 50 వేల రూపాయలకు పడిపోయాడని తెలుస్తుంది. కొత్త కమెడియన్స్ ఎంట్రీ ఇవ్వడంతో పాటుగా కొత్తరకం కామెడీ కూడా అందరిని అలరిస్తుంది. అందుకే బ్రహ్మానందం కు పాత్రలు తగ్గాయి.

వెయ్యికిపైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ రికార్డ్ సైతం ఎక్కిన బ్రహ్మానందం 5 లక్షల కాల్ షీట్ నుండి 50వేలకు పడిపోయినా సరే ఆయనంటే ఆడియెన్స్ కు అదోరకమైన క్రేజ్. ఇప్పటికైనా కొత్త కామెడీ పాత్రలు ఆయనకు వచ్చి ఆడియెన్స్ ను ఇంకా అలరించాలని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news