బాలయ్య టార్గెట్ సింపులే.. అజ్ఞాతవాసి దానికి సహకరిస్తాడు..!

balayya and pavan kalyan

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 27 కోట్లు మాత్రమే.. అంటే 30 కోట్లు తెస్తే అటు నిర్మాత ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరు సేఫ్ అన్నట్టే లెక్క. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా ఏకంగా 50 కోట్ల వసూళ్లను రాబట్టింది.

అయితే తర్వాత వచ్చిన పైసా వసూల్ మాత్రం నిరాశ పరచింది. ఇక జై సింహా మాత్రం సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో హిట్ కాంబోగా నయనతార నటించింది. చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు. ఎలాగు పోటీగా వచ్చిన అజ్ఞాతవాసి అంత గుడ్ టాక్ రాబట్టుకోలేదు కాబట్టి జై సింహా అంచనాలను అందుకుంటే సూపర్ హిట్ అన్నట్టే లెక్క.

అజ్ఞాతవాసి మొదటి రోజు కలక్షన్స్.. పవర్ స్టార్ స్టామినా ఇది..!

Leave a comment