చేసిన తప్పుకు క్షమాపణ చెప్పిన బాలయ్య..!

120

బుధవారం హిందూపురంలో ప్రచారంలో ఉన్న నందమూరి బాలకృష్ణ ఓ వీడియో జర్నలిస్ట్ మీద చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. బాలకృష్ణ ఆ వీడియో జర్నలిస్టుని కొట్టడం పక్కన ఉన్న వరు సెల్ ఫోన్ లో షూట్ చేయడం అది నిన్నటి నుండి వైరల్ గా మారడం జరిగింది. అయితే ఈ విషయంపై జర్నలిస్ట్ సంఘాలు బాలకృష్ణ మీద సీరియస్ గా ఉండటంతో బాలయ్య దిగి రాక తప్పలేదు.

హిందూపురం ప్రచారంలో చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నారని అది అల్లరిమూకల పని అని అలా చేయొద్దని వారిని వారించడం జరిగింది. అక్కడ ఉన్నది మీడియా వారని తర్వాత తెలిసింది. ఇది తాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఈ విషయంలో మీడియా మిత్రులకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించండి అంటూ బాలకృష్ణ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.

ఏపి ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో పార్టీలన్ని ప్రచార పర్వంలో మునిగితేలుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్ర్తి విమర్శలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న ఏపి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. అదేరోజు తెలంగాణాలో కూడా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.

Leave a comment