బాలయ్య తో మనకి గొడవలు వద్దు రా బాబూ అనుకుంటున్న సాయి ధరం తేజ

బీవీఎస్ రవి మొట్ట మొదటి సారి డైరెక్షన్ లో అడుగుపెట్టి తీస్తున్న జవాన్ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. దేశ భక్తి నేపధ్యం లో రాబోతున్న జవాన్ సినిమాలో సాయి ధరం తేజ హీరోగా కనిపిస్తాడు. ఈ సినిమా టీజర్ కీ ప్రోమో లకీ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఆగస్ట్ 11 న ఈ సినిమాని విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసారు. సరే ఆ టైం లో నేనే రాజు నేనే మంత్రి , జయ జానకి నాయక , లై ఇలా మూడు సినిమాలు విడుదల ఉండడం తో పోస్ట్ పోన్ చేసారు .

సెప్టెంబర్ 1 కి విడుదల చెయ్యాలి అని అంతా సిద్దం చేసుకున్నారు .రవి – సాయి – ప్రొడ్యూసర్ లు – డిస్ట్రిబ్యూటర్ లూ దీని గురించి ప్రత్యేకంగా సమావేశం అయ్యి మరీ ఆ తేదీ ని ఫిక్స్ చెయ్యగా ఇప్పుడు సాయి ధరం తేజ కి షాక్ ఇస్తూ బాలయ్య బాబు అడ్డం వచ్చారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ‘పైసా వసూల్’ ను సెప్టెంబర్ 29న విడుదల చేయాలనుకున్నారు. ఆ తేదీన పోటీ ఎక్కువ కావడంతో .. థియేటర్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. సో జవాన్ సినిమాకి బాలయ్య మామూలు టెన్షన్ పెట్టట్లేదు. బాలయ్య తో సినిమా విడుదల ఒద్దు అని సాయి ధరం తేజ భయపడుతున్నాడు అని తెలుస్తోంది

Leave a comment