నందమూరి వారసులపై బాలయ్య అనూహ్య స్పందన..!

balayya-comments-on-ntr-sons

ఎన్.టి.ఆర్ ఇంట కొత్త వారసుడి ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీలోనే కొత్త ఉత్సాహం వచ్చింది. అంతేకాదు ఈ వారసుడి రాక వారి కుటుంబాల మధ్య దూరాన్ని కూడా దగ్గరి చేసేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్.టి.ఆర్ రెండో కొడుకు పుట్టాడన్న వార్తపై బాలయ్య స్పందించినట్టుగా తెలుస్తుంది. కొత్తగా ఎన్.టి.ఆర్ ఇన్ స్టాగ్రాంలో తన ఇద్దరి కొడుల పిక్ షేర్ చేశాడు.

దీనిపై అనూహ్యంగా బాలకృష్ణ స్పందించినట్టు టాక్. ముఖ్యంగా నందమూరి కుటుంబం మరింత పెద్దదవుతుందని తన సన్నిహితులతో ప్రస్తావించారట బాలయ్య బాబు. ఎన్.టి.ఆర్ షేర్ చేసిన ఆ ఫోటో చూసి తెగ సంబరపడ్డాడట. డైరెక్ట్ గా కలుసుకునే అవకాశం ఉన్నా వారిమధ్య వచ్చిన విభేదాల వల్ల అలా చేయడం కుదరట్లేదని తెలిసిందే.

అయితే త్వరలోనే నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి కాబోతుందన్న మంచి వాతావరణం మాత్రం కనిపిస్తుంది. సందర్భం ఏంటన్నది తెలియదు కాని మళ్లీ ఒకే ఫ్రేమ్ లో బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ను కలిసి చూసే రోజు దగ్గర్లోనే ఉందని మాత్రం నందమూరి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Leave a comment