అరవింద సమేతలో అద్భుతమైన ట్విస్ట్..!

31

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో తారక్ కేవలం మాస్ లుక్ లోనే కనిపిస్తారని అనుకున్నారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందట. సినిమాలో తారక్ కాలేజ్ కుర్రాడిగా వెళ్లే సీన్స్ ప్రస్తుతం షూట్ చేస్తున్నారట.

ఈ షెడ్యూల్ లో సాంగ్స్ కూడా షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. పూజా హెగ్దె ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పక్క ఫ్యాక్షన్ లీడర్ గా.. మరోపక్క కాలేజ్ స్టూడెంట్ గా తారక్ రెండు వేరియేషన్స్ లో అదరగొడతాడని తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a comment