Movies" అరవింద సమేత " ప్రీమియర్ షో టాక్..!

” అరవింద సమేత ” ప్రీమియర్ షో టాక్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఈషా రెబ్బ నటించగా సునీల్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేశారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుండగా కొద్దిసేపటి క్రితమే యూఎస్ లో ప్రీమియర్ షో ముగిసింది.

అంచనాలకు తగినట్టుగానే అరవింద సమేత వీర రాఘవ అదరగొట్టాడని అంటున్నారు. ఫస్ట్ టాక్ సినిమా సూపర్బ్ అని.. అటు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్, ఇటు త్రివిక్రం ఫ్యాన్స్ అందరు సాటిస్ఫై అయ్యేలా సినిమా దుమ్ముదులిపేసిందని అంటున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో త్రివిక్రం ఎంచుకున్న స్టోరీ కూడా చాలా బాగుందని అంటున్నారు.

సినిమాలో తమన్ మ్యూజిక్ కీ పాయింట్ గా నిలిచిందని తెలుస్తుంది. పెనివిటి సాంగ్.. అనగనగా సాంగ్ బాగుండగా రెడ్డి ఇటు చూడు ఎన్.టి.ఆర్ డ్యాన్సింగ్ నెంబర్ గా అలరిస్తుందట. ఇక సినిమాలో జగపతి బాబు విలనిజం బాగుందని. సినిమాలో హీరోయిన్ పూజా హెగ్దెకి మంచి పాత్ర దొరకగా ఈషా రెబ్బ కూడా సపోర్టివ్ గా నిలిచిందట. ఇక సునీల్ మరోసారి తన కామెడీ పంచులతో అలరించాడని తెలుస్తుంది. సినిమాలో హీరో పక్కన దాదాపు ఎక్కువ భాగం సునీల్ కనిపిస్తాడు.

మొత్తానికి భారీ అంచనాల నడుమ వచ్చిన అరవింద సమేత ఆ అంచనాలను అందుకుందని అంటున్నారు. యూఎస్ లో మొదటి రోజు మిలియన్ మార్క్ దాటేయడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు ప్రీమియర్స్ తో ఇప్పటికే వసూళ్ల సంచలనం మొదలైందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news