అరవింద సమేత సెన్సార్ రివ్యూ..షాక్ లో ఫ్యాన్స్ ..!

125

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ విడుదలకు కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి రావడం తో అభిమానుల్లో ఆత్రుత పెరిగిపోతోంది. ఎన్టీఆర్ నటన విశ్వరూపం చూడబోతున్నారని , ఇప్పటి వరకు చూసిన త్రివిక్రమ్ వేరు ఈ సినిమాలో చూసిన త్రివిక్రమ్ వేరు అనేలా ఉందని, అసలు సిసలైన యాక్షన్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఎన్టీఆర్ చూపించాడని ఈ సినిమా చూసిన సెన్సార్ బృందం చెప్పడంతో అభిమానుల్లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది.

ఈ సినిమా రిలీజ్ టైం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుని‘యు/ఎ’ సర్టిఫికెట్ సంపాదించుకుంది. సినిమాలో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉండడం తో క్లిన్ యూ సర్టిఫికెట్ రాలేదని తెలుస్తోంది. ఈ సినిమా నిడివి మొట్ట 2 .42 గంటలుగా ఉండబోతుందట. అసలు సిసలైన యాక్షన్ ఎలా ఉంటుందో చూపించాడని అంటున్నారు. ఇక సినిమాలో నటించిన నటీనటులంతా ఎంతో బాగా నటించారు అనడం కన్నా జీవించారని కొంతమంది సెన్సార్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.
1
ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే మొదటిభాగం జనతా గ్యారేజ్ .. రెండో భాగం ”ఆది” సినిమాల రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు చెబుతున్న మాటలను బట్టి ఈ సినిమా భారీ హిట్ కొట్టి రికార్డ్స్ తిరగరాసేలా కనిపిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 11 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Leave a comment