” అరవింద సామెత వీర రాఘవ ” అఫిషియల్ టీజర్

58

” అరవింద సామెత వీర రాఘవ ” అఫిషియల్ టీజర్

ఒక టీజర్ ఎలా ఉంటే నందమూరి అభిమానులే కాదు సిని ప్రేమికులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయో.. ఒక టీజర్ ఎలా ఉంటే సినిమా అంచనాలను పెంచగలదే అదిగో అలాంటి లెక్కలను సరిగ్గా లెక్క చెప్పి మరి వచ్చిన టీజర్ అరవింద సమేత వీర రాఘవ. త్రివిక్రం డైరక్షన్.. ఎన్.టి.ఆర్ నటన.. అంచనాలు ఎలా ఉంటాయో దానికి ఒక మెట్టు ఎక్కువే సినిమా ఉంటుంది అని చెప్పేలా ఈ టీజర్ ఉంది.

టీజర్ మొత్తం అవుట్ స్టాండింగ్ అనిపించగా.. చివర్లో కంట పడ్డవా కనికరిస్తానేమో.. వెంట పడ్డవా అంటూ ఎన్.టి.ఆర్ చెప్పిన డైలాగ్ మళ్లీ రికార్డుల ఊచకోతకు ఈ టైగర్ సిద్ధమైందని తెలుస్తుంది. నిమిషానికి తక్కువే ఇలాంటి రచ్చ చేశాడంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో నందమూరి ఫ్యాన్స్ అంచనాలకు ఆకాశమే హద్ధని చెప్పొచ్చు. దసరా బరిలో దమ్ము చూపించేందుకు వస్తున్న అరవింద సమేత రికార్డులని దుమ్ము దుమ్ము చేసేలా వస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

Leave a comment