ఐదు రోజులు కలెక్షన్స్..! అదరగొడుతున్న “అరవింద సమేత”

144

ఎన్టీఆర్ పవర్ ఫుల్ యాక్షన్ తో … త్రివిక్రమ్ మార్క్ డైలాగులతో ‘అరవింద సమేత’ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్ తో రికార్డులను తిరగరాస్తోంది. సినిమా విడుదలకు ముందునుంచే అంచనాలు బారీగా ఉండడం.. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం అంతే కాక ఈ సినిమా విడుదల సమయానికి దసరా సెలవులు కావడం..సినిమా విడుదలకు దగ్గరలో మరే సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.
1
ఇప్పటికే ఈ సినిమా అయిదు రోజులను పూర్తి చేసుకొని 6 వ రోజు లోకి అడుగు పెట్టింది. అయితే 5వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.55 వసూలు చేసింది. ఒక్క సారి అరవింద సమేత రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాల వారీగా చూసుకుంటే…

ఐదు రోజులకు గానూ ఏపీ తెలంగాణా లలో ‘అరవింద సమేత’ అర్థ సెంచరీ మార్కును దాటి రూ.52.65 కోట్ల షేర్ ను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియా వైజ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 15.00 కోట్లు

సీడెడ్ – 11.81 కోట్లు

ఉత్తరాంధ్ర – 5.93 కోట్లు

ఈస్ట్ – 4.29 కోట్లు

వెస్ట్ – 3.52 కోట్లు

కృష్ణ – 3.77 కోట్లు

గుంటూరు – 6.37 కోట్లు

నెల్లూరు – 1.96 కోట్లు

మొత్తం – 52.65 కోట్లు (ఏపీ + తెలంగాణా 5 రోజుల షేర్)

అయితే ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే వరల్డ్ వైడ్ గా 68.1 కోట్ల షేర్ అలాగే 111.1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Leave a comment