అనుష్క కొత్త లుక్ అదుర్స్… కాని పక్కన కూర్చున్న అతనెవరు..!

Anushka surprises in a new look

స్వీటీ అనుష్క మళ్లీ మునుపటి లుక్ తో అందరిని సర్ ప్రైజ్ చేసింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అనుష్క నాజుకుగా మారి మళ్లీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సైజ్ జీరో కోసం లావుగా తయారైన అనుష్క ఆ సినిమా నుండి సన్నబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఫైనల్ గా అనుష్క మళ్లీ ఎప్పటి రూపాన్ని తెచ్చుకుంది. ముఖ్యంగా తన ఫ్యాన్స్ అనుష్క ఈ న్యూ లుక్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాహుబలి-2, సింగం-3, భాగమతి కొన్ని ఎపిసోడ్స్ లో కూడా అనుష్క లావుగా కనిపించింది.

అయితే ఆమె ఆస్ట్రియా వెళ్లి అక్కడ నాచురో థెరపీ తీసుకుని మళ్లీ మునుపటి రూపంలోకి వచ్చింది. ప్రస్తుతం అనుష్క పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అంతా బాగానే ఉన్నా అనుష్కతో పాటుగా పక్కన కూర్చున్న అతనెవరు అన్న విధంగా వేట మొదలు పెట్టారు. లుకే కౌంటినో అనే నాచురో థెరపీకు సంబందించిన వ్యక్తితో అనుష్క క్లోజ్ గా మూవ్ అయ్యింది. కొంపదీసి అతన్ని పెళ్లి చేసుకుంటుందా ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

కొందరైతే అనుష్క పెళ్లి చేసుకునేది అతన్నే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా అనుష్క మళ్లీ ఎప్పటిలానే మారడం కచ్చితంగా ఆమె ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మాధవన్ తో సీక్రెట్ సినిమా చేస్తున్న అనుష్క ఇక వరుస సినిమాలు చేసేందుకు సై అంటుంది.

Leave a comment