అల్లుడి కోసం ఆ హీరోయిన్ కి చిరు గేలం…!

chirus son in law

అల్లుడొస్తున్నాడో … సినిమా చేస్తున్నాడో .. అంటూ మెగా ఫ్యామిలీ ఆనందంలో ఉంది. గత రెండురోజుల నుంచి చిరు చిన్నల్లుడు సినిమాల్లోకి వస్తున్నాడంటూ ఒకటే హడావుడి మొదలెట్టేసారు. మీడియా లో అయితే ఈ హడావుడి మాములుగా లేదు. చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తాడు.. దర్శకుడు ఎవరు అనే విషయాలు ఇంకా బయటకి పొక్కనప్పటికీ … హీరోయిన్ ఎవరనేది మాత్రం బయటకి లీక్ అయిపొయింది.

ఇప్పటికే కళ్యాణ్ తీయబోయే సినిమా కథని చెర్రీ, చిరు ఇద్దరూ విన్నారట.
అయితే కళ్యాణ్ సినిమాను రాజమౌళికి అత్యంత సన్నిహితుడు కొర్రపాటి సాయి నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా స్టోరీని కొర్రపాటి సాయి రాజమౌళితో కలిసి చిరంజీవికి చెప్పినప్పుడు ఆకథ బాగా నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈమూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక పై కూడ కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈకథకు అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా బాగుంటుంది అని చిరంజీవి సాయి కొర్రపాటికి సూచించినట్లు తెలుస్తోంది.
అనుపమ పరమేశ్వరన్ సహాయకుల నుంచి ఈ న్యూస్ మీడియాకు లీక్ అయినట్లు తెలుస్తోంది. దీనితో అప్పటివరకు రహస్యంగా ఉంచిన చిరంజీవి చిన్నల్లుడు సినిమా వ్యవహారం ఇప్పుడు ఓపెన్ అయిపొయింది. ఒకేసారి అందరికీ తెలిసేలా షాక్ ఇద్దామనుకున్న కళ్యాణ్ ఫిలిం ఎంట్రీ న్యూస్ ఇలా అనుకోకుండా లీక్ అవ్వడం చిరంజీవికి కూడ షాక్ ఇచ్చినట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈసినిమా ప్రారంభం జనవరిలో అత్యంత ఘనంగా రాజమౌళి రాఘవేంద్రరావు లాంటి ప్రముఖుల సమక్షంలో కళ్యాణ్ ఫిలిం ఎంట్రీ నిర్వహించాలన్న ఈసినిమా నిర్మాత సాయి కొర్రపాటి ఆలోచనలకు ప్రస్తుతానికి చిరంజీవి బ్రేక్ వేసినట్లు సమాచారం

Leave a comment