ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ల మధ్య చిచ్చుపెట్టిన ‘గూగుల్’..?

Allu Arjun Jr NTR Google most searched Star

There’s apparently a huge controversy prevailed over social media about the most Googled Telugu actor for 2016 between Fans of Stylish Star Allu Arjun and Young Tiger NTR.

ప్రముఖ సెర్ఛ్ ఇంజన్ ‘గూగుల్’ ప్రతిఏటా ఓ సర్వే నిర్వహిస్తుంది. ఆ ఏడాదిలో గూగుల్‌లో అత్యధికంగా ఎవరి పేరు సెర్చ్ చేయబడిందనే దానిపై ఓ రిపోర్ట్ వెల్లడిస్తుంది. ఈసారి కూడా అలాంటిదే ఓ సర్వే నిర్వహించి, రిపోర్ట్ వెల్లడించగా.. అది యంగ్‌టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ల మధ్య చిచ్చుపెట్టింది. ఎందుకంటే.. అది వెల్లడించిన రిజల్ట్ అలాంటిదన్నమాట. ఆ వివరాలేంటో.. క్రింద మేటర్‌లో తెలుసుకుందాం పదండి…

ఈ ఏడాదిలో బన్నీ ‘సరైనోడు’ చిత్రంతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. కేరళలోనూ ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో.. బన్నీ పేరు మారిమోగిపోయింది. దీంతో.. గూగుల్‌లోనూ అతను ట్రెండ్ అయ్యాడు. ఎంతోమంది అతని వివరాలు తెలుసుకోవడం గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. దాంతో.. ఈ ఏడాదిలో ఎక్కువ శాతం సెర్చ్ చేయబడిన హీరోగా పేరుగాంచాడు. ఈ విషయాన్ని గూగుల్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. అయితే.. ఎన్టీఆర్ విషయంలో మాత్రం రెండు రిజల్ట్స్ తెలిపింది. అదే.. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వివాదానికి దారితీసింది.

తారక్ ఈ సంవత్సరంలో ‘నాన్నకు ప్రేమతో’ మూవీతో అబౌవ్ యావరేజ్ హిట్, ‘జనతా గ్యారేజ్’ సినిమాతో కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ విజయం దక్కించుకున్నాడు. వాస్తవానికి ‘గ్యారేజ్’ టాలీవుడ్ ఆల్‌టైం రికార్డ్ చిత్రాల జాబితాలో మూడో స్థానం కూడా సంపాదించుకుంది. పైగా.. కేరళలోనూ ఈ చిత్రం రిలీజ్ అవ్వడంతో, తారక్ పేరు కూడా గూగుల్‌లో మారుమోగింది. అయితే.. ‘ఎన్టీ రామారావు జూనియర్’అనే కీ-వర్డ్‌తో సెర్చ్ చేసినప్పుడు తారక్ కంటే బన్నీనే ముందు స్థానంలో ఉన్నాడని, అదే ‘ఎన్టీఆర్’ అనే కీ-వర్డ్‌తో సెర్చ్ చేయగా అతడే బన్నీ కంటే ముందు వరుసలో ఉన్నాడని గూగుల్ తన నివేదికలో వెల్లడించింది.

ఈ విధంగా గూగుల్ వెల్లడించిన రిజల్ట్.. ఆ ఇద్దరి హీరోల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అల్లుఅర్జున్‌ని ఒక కీ-వర్డ్‌తో సెర్చ్ చేసినందుకే ఫస్ట్ ప్లేస్‌లో వచ్చాడని అతని ఫ్యాన్స్ వాదిస్తుంటే.. కాదు ఆ రెండు కీ-వర్డ్స్ (ఎన్టీ రామారావ్ జూనియర్, ఎన్టీఆర్) తమ హీరోకే చెందినవి కాబట్టి, తమ హీరోనే అత్యధికంగా సెర్చ్ చేయబడ్డాడని సోషల్ మీడియాలో గొడవకు దిగారు. ప్రస్తుతానికి ఈ అభిమానుల వివాదం ఇప్పటికిప్పుడే సద్దుమణిగేలా లేదు.

Leave a comment