‘నైజాం’కా నవాబు నేనే అంటున్న రామ్ చరణ్.. వెనుకబడ్డ బన్నీ, మహేష్, పవన్, తారక్‌లు!

ram charan sensational record with dhruva

Mega powerstar Ram Charan has created a sensational record in Nizam territory with Dhruva movie among the all star heroes in Tollywood. Read below article to know more detaisl.

తన లేటెస్ట్ ఫిల్మ్ ‘ధృవ’తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న రామ్ చరణ్.. రెండు అరుదైన ఘనతలు సాధించాడు. కెరీర్ ప్రారంభం నుంచి ప్రయత్నిస్తున్న 1 మిలియన్ డాలర్ మార్క్‌ని యూఎస్‌లో అందుకున్న ఈ హీరో.. ‘నైజాం’ ఏరియాలో సంచలన రికార్డ్ నమోదు చేశాడు. ఇండస్ట్రీలో ఉన్న ఇతర స్టార్ హీరోల్ని వెనక్కి నెట్టేసి.. ఆ ఏరియాకి తానే నవాబునంటూ చాటిచెప్పాడు.

ఇప్పటివరకు రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ‘మగధీర’, ‘రచ్చ’, ‘నాయక్’, ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీలు నైజాం ఏరియాలో రూ.10 కోట్లపైనే కలెక్ట్ చేశాయి. తాజాగా ‘ధృవ’తోనూ ఆరోసారి ఆ ఫీట్‌ని అందుకున్నాడు. ఇలా నైజాంలో ఆరుసార్లు 10 కోట్ల మార్క్ చేసిన హీరోగా రామ్ చరణ్ మొదటిస్థానంలో నిలిచాడు. బన్నీ కూడా ఐదుసార్లు ఈ ఫీట్‌ని అందుకున్నాడు. ‘జులాయి’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’ చిత్రాలు నైజాంలో పదికోట్లపైనే వసూళ్లు రాబట్టాయి. వీటితోపాటు బన్నీ ‘గోనగన్నారెడ్డి’ అనే స్పెషల్ పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ ని జాబితాలో తీసుకుంటే.. ఆరు సినిమాలు అవుతాయి. అయితే.. సోలో హీరోగా తీసుకుంటే మాత్రం, చెర్రీనే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లు లెక్క.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్‌బాబులు ఐదుసార్లు ఆ ఫీట్‌ని అందుకుని.. చరణ్, బన్నీల తర్వాత మూడో స్థానంలో నిలిచారు. ఆ ఇద్దరి తర్వాత నాలుగో స్థానంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నిలిచాడు. ఇతను నటించిన 26 సినిమాల్లో కేవలం (బాద్‌షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) నాలుగు మాత్రమే నైజాంలో పదికోట్ల మార్క్‌ని క్రాస్ చేయగలిగాయి. చివరగా ప్రభాస్ సినిమాలైన ‘మిర్చి’, ‘బాహుబలి’లు ఆ ఏరియాలో పదికోట్లు రాబట్టాయి.

Leave a comment