బన్నీ కోసం పవన్ అజ్ఞాతవాసి పోస్టుపోన్..?

allu arjun

చాలా కాలంగా మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ మధ్య విబేధాలు ఉన్నట్టు బహిరంగంగానే వార్తలు వినిపించేవి. దీనికి భలం చేకూర్చుతూ … ఆ హీరోలు కూడా అలానే ప్రవర్తించేవారు. ఇంతే కాకుండా … పవన్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ మధ్య అవకాశం దొరికినప్పుడల్లా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ కోసం పవన్ ఒక త్యాగానికి సిద్ధపడడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది.

ఎన్నో అంచనాలతో .. సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్న ‘అజ్ఞాతవాసి’ ప్రమోషన్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే భారీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే … ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు రిలీజ్ అయిపోయిన నేపధ్యంలో మొన్న క్రిస్మస్ సందర్భంగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషం లో ఈ ప్లాన్ లో మార్పు చేసుకుని కొత్త సంవత్సరం రోజున విడుదల చేద్దాము అని డిసైడ్ అయ్యారు.

డిసెంబర్ 31 రాత్రి పవన్ పాడిన ‘కొడుకా కోటేశ్వరరావు’ పాట జనవరి 1న ఈమూవీ ట్రైలర్ విడుదల చేయాలి అనేది ప్లాన్. అయితే ఈ ప్లాన్ కు అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అడ్డు వచ్చింది. ఈ సినిమా టీజర్ ను జనవరి 1న విడుదల చేస్తున్న నేపధ్యంలో ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ విడుదల తేదీని జనవరి 5కు మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ లోని పాట ప్రభావం కనీసం ఒక ఐదు రోజులు ఉంటుంది కాబట్టి ప్రతి ఐదు రోజులకు ఎదో ఒక సంచలనం ‘అజ్ఞాతవాసి’ టీమ్ నుండి రావాలి అన్న ఆలోచనతో త్రివిక్రమ్ ఈ మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం అల్లు అర్జున్ కోసం పవన్ వంటి టాప్ హీరో తన తేదీని మార్పు చేసుకోవడం నిజంగా గొప్ప విషయమే. అదే పవర్ స్టార్ గొప్పతనం అని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు.

Leave a comment