పెళ్లికాని వారికి కోరిక పుట్టించడం గ్యారెంటీ అంటున్న హీరోయిన్!

23

తెలుగులో ప్రస్తుతం హాట్ ఫెవరెట్ సినిమాగా తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. యంగ్ హీరో నితిన్, అందాల భామ రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ‘శతమానం భవతి’ మూవీతో అదిరిపోయే సక్సెస్ కొట్టిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సేమ్ రిజల్ట్‌ రిపీట్ అవుతుందని అంటున్నారు చిత్ర యూనిట్. అన్ని పనులు పూర్తి చేసుకున్న ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీ ఫస్ట్ లుక్ మొదలుకొని, టీజర్, ట్రైలర్లతో జనాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేశాడు చిత్ర నిర్మాత దిల్ రాజు. చిత్ర యూనిట్‌తో పాటు కొంత మంది శ్రేయోభిలాషుల మధ్య ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఈ సినిమా చూసిన అందరూ చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తరువాత ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా నటి సితార కూడా ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడింది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాగా నిలుస్తుందని ఆమె చెప్పారు. తన 33 ఏళ్ల సినీ కెరీర్‌లో తనకు చాలా దగ్గరయిన సినిమాలు కొన్నే కాగా అందులో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని ఆమె చెప్పింది. పెళ్లి కాని వారు ఈ సినిమా చూస్తే పెళ్లి చేసుకోవాలనే కోరిక వారిలో పుట్టడం గ్యారెంటీ అంటూ ఈ సినిమాపై ఆమె ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉందో చెప్పింది.

మొత్తానికి ఈ సినిమాపై అటు హీరో నితిన్‌తో పాటు చిత్ర యూనిట్ అందరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమాగా ఉన్నారు. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఆగష్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

Leave a comment