Movies"ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలని ఉంది"..మనసులోని కోరికను బయటపెట్టిన కోవై...

“ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలని ఉంది”..మనసులోని కోరికను బయటపెట్టిన కోవై సరళ..!

కోవై సరళ.. ఇప్పటి జనాలకు కూడా మంచిగా బాగా తెలిసిన పేరు . సీనియర్ నటినే కానీ ఆమె సినిమాలో నటిస్తే కామెడీ ఏ విధంగా ఉంటుంది..? కడుపు ఏ విధంగా నొప్పి వస్తుంది అనే విషయం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఆమె తెరపై కనిపించింది అంటే ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది . నవ్వి నవ్వి ఎవ్వరైనా సరే కడుపు నొప్పి రావాల్సిందే . మనలో చాలామంది కూడా అలా ఆమె నటన చూసి నవ్వుకున్న వాళ్ళు ఉన్నాం .

కాగా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో పల సినిమాలో నటిస్తూ మెప్పించిన కోవై సరళ ఇప్పుడు కేవలం కొన్ని కోలీవుడ్ సినిమాలలో మాత్రమే కనిపిస్తుంది . అది కూడా తనకు నచ్చిన పాత్రలో మాత్రమే నటిస్తూ మెప్పిస్తుంది. కామెడీ ప్రధానంగా ఉండే సినిమాలను చూస్ చేసుకుంటుంది కోవై సరళ . రీసెంట్గా ఆలీ హోస్ట్ చేస్తున్న ఆలీతో సరదాగా షో కు వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంది .

“మా సొంత ఊరు కోయంబత్తూర్ ..అందుకే నన్ను షార్ట్ లో కొవై అని అంటా ఉంటారు . మా ఊరి పేరే నాకు ఇలాంటి పేరుగా మారిపోవడం నాకు చాలా చాలా నచ్చింది..” అంటూ మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది . ఈ క్రమంలోనే పెళ్లి గురించి ప్రస్తావించిన ఆలీకు..” పెళ్లి అవసరమేముంది..? పెళ్లి చేసుకునే జీవించాలి అన్న కండిషన్ లేదు కదా..?” అంటూ క్లారిటీ ఇచ్చింది .

అయితే సరదాగా మాట్లాడుతూ..” ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో మీరు పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరిని చేసుకుంటారు ” అనే ప్రశ్న ఎదురవగా..” అల్లు అర్జున్ ని చేసుకుంటాను” అంటూ సరదాగా చెప్పుకు వచ్చింది . ప్రెసెంట్ ఈ కామెంట్స్ న్రెట్టింట వైరల్ గా మారాయి . అయితే జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డ కోవై సరళ డబ్బుని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవడమే జీవితంలో మనం తీసుకునే మంచి నిర్ణయమని చెప్పుకొచ్చింది . ప్రజెంట్ కోవై సరళ కి సంబంధించిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news