Moviesటిల్లు స్క్వేర్ సినిమా సిద్దు జొన్నలగడ్డ కాకుండా.. ఆ హీరో చేసుంటే.....

టిల్లు స్క్వేర్ సినిమా సిద్దు జొన్నలగడ్డ కాకుండా.. ఆ హీరో చేసుంటే.. ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఉండేదా..?

టిల్లు స్క్వేర్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. గతంలో తెరకెక్కిన డిజె టిల్లు సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కింది .ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఏకంగా ఐదు రోజుల్లో 85 కోట్లు క్రాస్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది . ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన పలు వార్తలను ట్రెండ్ చేస్తున్నారు సిద్దు జొన్నలగడ్డ ఫ్యాన్స్ .

ఈ సినిమాకి కర్త – కర్మ – క్రియ అంతా కూడా సిద్ధూ జొన్నలగడ్డ అని ఓ రేంజ్ లో పొగిడేస్తుంటే మరొక పక్క కొందరు మాత్రం ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ బాగా నటించాడు అని కానీ సిద్ధూ జొన్నలగడ్డ కన్నా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది అని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాదు చరిత్ర తిరగరాసి ఉండేలా ఉండేది అని చెప్పుకొస్తున్నారు. దీంతో సినిమాకి సంబంధించిన ఇదే న్యూస్ వైరల్ గా మారింది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి ట్రోలింగ్ చాలా కామన్ గా వింటున్నామని.. కానీ ఈ సినిమాకి 100% న్యాయం చేసిన నటుడు సిద్దు జొన్నలగడ్డ అని ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు సిద్దు పేరుని ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయేలా చేస్తున్నారు . ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు. చూడాలి మరి సిద్దు జొన్నలగడ్డ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ..? అభిమానులను ఎలా మెప్పించబోతున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news