Moviesభారీగా పడిపోయిన గేమ్ ఛేంజర్ హైప్స్.. ఆ ఒకే ఒక మిస్టేక్...

భారీగా పడిపోయిన గేమ్ ఛేంజర్ హైప్స్.. ఆ ఒకే ఒక మిస్టేక్ తో మొత్తం పెంట పెంట చేశారు కదరా..!

ఎస్.. మీరు వింటుంది నిజమే. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో నెట్టింట చక్కర్లు కొడుతుంది. గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకుని ప్రస్తుతం గేమ్ చేంజర్ తో మరోసారి ఫామ్ లోకి వద్దామని చూస్తున్నాడు చెర్రీ. కానీ తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ తో దానిని మొత్తం పెంట పెంట చేశారని చెప్పుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ మూవీతో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న చెర్రీ నెక్స్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ మూవీ నే గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక కియారా అద్వానీ మరియు చెర్రీ కాంబినేషన్లో ఇప్పటికే ఒక సినిమా తెరకెక్కింది. కానీ ఇప్పటివరకు అంజలి మరియు చరణ్ కాంబినేషన్ లో ఏ సినిమా కూడా రాలేదు.

ఇక ఈ మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చిన్న చిన్న హింట్స్ ఈ సినిమాపై భారీ ఊహలను నెలకొల్పారు. కానీ తాజాగా వాటన్నిటిని మంటపాలు చేశారని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ సెన్సేషన్గా పేరు సంపాదించిన థమన్ మ్యూజిక్ వల్లే ఇదంతా వచ్చింది. గత కొంతకాలం నుంచి థమన్ పై విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. కానీ వాటిని డైరెక్టర్స్ పట్టించుకోకుండా ఈయననే మ్యూజిక్ కి తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఇదే దెబ్బ అయ్యిందని చెప్పుకోవచ్చు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది మ్యూజిక్ సెన్సేషన్స్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ థమన్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానిని చనువుగా తీసుకుని తమన్ సైతం ఏదో ఒక బిజిఎం ఇచ్చేస్తూ ఉన్నాడు.

అలా ఇచ్చిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ గా నిలుస్తున్నాయి. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న అనగా మార్చ్ 27న ఓ సాంగ్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ ని చూసిన చెర్రీ ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే.. ఈ సాంగ్ లో అంతలాగా ఆకట్టుకునే సౌండ్ సిస్టం మరియు లిరిక్స్ ఏమీ లేవు. ఏదో ఒక సాంగ్ పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టినట్లు అనిపిస్తుంది. మరో మెయిన్ మిస్టేక్ ఏంటంటే.. ఈ మూవీలో చెర్రీ గెటప్ మరీ చండాలంగా ఉందనే చెప్పొచ్చు. మొదట పోస్టర్లలో ఉన్న చెర్రీ లుక్ సాంగ్ లో లేదు. ఒక రౌడీ హీరో లాగా చెర్రీ ని చూపించారు. దీంతో ఇవన్నీటిని చూసిన ప్రేక్షకులకి గేమ్ చేంజర్ పై హైప్స్ పడిపోయాయి. ఏది ఏమైనా ఒకే ఒక్క సాంగ్ తో సినిమా మీద ఉన్న హైప్స్ మొత్తం పెంట పెంట చేశారని చెప్పొచ్చు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news