Movies" మీరు చేసిన తప్పులు వల్లే అనుపమ హర్ట్ అయింది.. అందుకే...

” మీరు చేసిన తప్పులు వల్లే అనుపమ హర్ట్ అయింది.. అందుకే ఇక్కడికి కూడా రాలేదు “.. సిద్దు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ లో తనకి తానే సాటి అంటూ దూసుకుపోతున్న హీరోయిన్స్ లో అనుపమ కూడా ఒకరు. తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంతమంది హీరోయిన్ లు ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుపమ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదు. అంతలాగా పాపులారిటీ సంపాదించుకుంది మరి. అఆ, హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇక గతంలో అనుపమ చేసిన ప్రతి సినిమా కూడా ఎంతో పద్ధతిగా ఉంటాయి. కానీ ప్రస్తుతం దానిని చేంజ్ చేస్తుంది అనుపమ.

టిల్లు స్క్వేర్ మూవీ లో సిద్దు తో రొమాన్స్ లో ఏ మాత్రం తగ్గడం లేదు. మునిపెన్నడు లేనివిధంగా తన అంద చందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంది. ఇక ఈమె ఎక్స్పోజింగ్ చూసి పలువురు తిడుతున్నారు కూడా. ఈమె ఎప్పుడైతే టిల్లు స్క్వేర్ లో నటించడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే ఈమెపై ఘోరమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రోల్స్ ని ఆపేందుకు అనుపమ చాలా ప్రయత్నించినప్పటికీ ఇవి మాత్రం ఆగడం లేదు. ఇక వీటికి భయపడి తాజాగా టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ కి కూడా రాకుండా మానేసింది అనుపమ. ఈ విషయాన్ని స్వయంగా హీరో సిద్దు నే వెల్లడించాడు.

సిద్దు మాట్లాడుతూ..” చెప్పాలా వద్దా అని అప్పటినుంచి చాలా ఆలోచిస్తున్నా. బట్ చెపుతా. ఇప్పుడు అందరూ ఇక్కడ మన సినిమాలో అనుపమణి చూస్తున్నారు. కానీ ఇప్పుడు మన ప్రమోషన్స్ లో అనుపమ లేదు. తను ఎందుకు లేదంటే దానికో కారణం ఉంది.. ఇప్పుడు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్లో ఒక బ్యాడ్ పొజిషన్ ఏదో చూసి చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు అనేక రకాలుగా రాస్తున్నారు. నిజానికి మీరు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం అమ్మాయి అని మైండ్ లో పెట్టుకోండి. ఇది నా ఆర్డర్ కాదు రిక్వెస్ట్. మీ వల్లే అనుపమ ఇప్పుడు ఇక్కడ లేదు ” అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news