Moviesపుష్ప1 లో జరిగిన ఆ తప్పును పుష్ప2లో సరిదిద్దుకుంటున్న సుకుమార్.. మహా...

పుష్ప1 లో జరిగిన ఆ తప్పును పుష్ప2లో సరిదిద్దుకుంటున్న సుకుమార్.. మహా తెలివైన వాడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. గతంలో ఆయన నటించిన పుష్ప 1 సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమా కోసం సుకుమార్ అల్లు అర్జున్ ఎంతలా కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియా ద్వారా అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తూ వచ్చింది.

రీసెంట్గా సోషల్ మీడియాలో పుష్ప2 లో శ్రీవల్లి పాత్రలో కనిపించబోతున్న రష్మిక మందన్నా లుక్ వైరల్ గా మారింది. ఎర్రటి పట్టుచీరలో ..ఒంటినిండా నగలు వేసుకొని.. తలలో కనకంబరాలు పెట్టుకొని.. చక్కటి మహారాణిలా అందంగా కనిపించింది . అయితే ఈ లుక్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి . చిట్టి పొట్టి బట్టల్లో మిడ్డీలతో కనిపించే రష్మిక మందన్నా.. పట్టుచీరలో చూసేసరికి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు .

అంతేకాదు పుష్ప 1 సినిమాలో డీ గ్లామరస్ లుక్ లో కనిపించింది రష్మిక మందన్నా. ఆ టైంలో చాలామంది సుకుమార్ కు రష్మిక ఫ్యాన్స్ సజెస్ట్ చేశారు. కనీసం పుష్ప 2 లోనైనా ఆమెను కొంచెం నార్మల్ లుక్స్ లో చూపించు బాసు అంటూ రిక్వెస్ట్ చేశారు . ఆ కామెంట్స్ ని బాగా పట్టించుకున్నట్లు ఉన్నాడు సుకుమార్.. ఆ కారణంగానే పుష్ప2 సినిమాలో రష్మిక మందన్నాను మహారాణిలా చూపించబోతున్నాడు. తాజాగా లీక్ అయిన పిక్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news