Movies"ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా అలాంటి పని చేశా"..మృణాల్ ఠాకూర్ సెన్సేషనల్...

“ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా అలాంటి పని చేశా”..మృణాల్ ఠాకూర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

మృనాల్ ఠాకూర్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వచ్చింది. రీసెంట్గా రిలీజ్ అయిన హాయ్ నాన్నతో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది .

సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన మృణాల్ ఠాకూర్ తన లైఫ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది . “నాకు ఈ స్టార్ స్టేటస్ ఏమి ఊరికే రాత్రికి రాత్రి రాలేదు అని ..ఇంత స్టార్ గా మారడానికి నేను ఎన్నో రాత్రులు కష్టపడ్డాను అని ..నటనలో ఇంకా నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎన్నో క్లాసెస్ అటెండ్ అయ్యాను అని తెరవనక నేను చాలా కష్టపడితేనే నాకు ఈ స్టార్ స్టేటస్ దక్కింది” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది .

దీనితో మృణాల్ ఠాకూర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యామిలీ స్టార్ సినిమా హిట్ అయితే బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్లను అందుకున్న ఘనత మృణాల్ సాధిస్తుంది . అంతేకాదు మృణాల్ ఠాకూర్ ప్రభాస్ తో ఏకంగా మూడు సినిమాలకు కమిట్ అయింది. మూడు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. మూడు హిట్ అయితే ఇక అమ్మడు ఆపలేవంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news