Moviesవైజాగ్ బీచ్‌లో క్లీంకారతో రామ్ చరణ్.. భారీ హింట్ ఇచ్చిన ఉపాసన..మెగా...

వైజాగ్ బీచ్‌లో క్లీంకారతో రామ్ చరణ్.. భారీ హింట్ ఇచ్చిన ఉపాసన..మెగా ఫ్యాన్స్ ఇది మీరు గమనించారా(వీడియో)..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ – గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది . కాగా ఇప్పటికీ షూటింగ్ పనుల్లో బిజీబిజీగానే ఉన్నాడు రాంచరణ్. అనుకున్న షెడ్యూల్ కి అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ కాకపోవడం ఈ సినిమాకి బిగ్ మైనస్ . అంతేకాదు ఈ సినిమాపై మెగా ఫాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు.

ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకునే రేంజ్ లో ఉండదు అంటూ ముందుగానే కనిపెట్టేస్తున్నారు. అయితే రామ్ చరణ్ మాత్రం అలాంటివి పెద్దగా పట్టించుకోవడం లేదు. కాగా ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న రాంచరణ్ – వైజాగ్ లో తన భార్య ఉపాసన కూతురు క్లీంకార తో టైం స్పెండ్ చేస్తున్నాడు. రీసెంట్గా వైజాగ్ బీచ్ లో సందడి చేశాడు రామ్ చరణ్ -క్లీంకార- ఉపాసన .

దానికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్చర్స్ వీడియోస్ ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నింది. మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ క్లీం కారతో పాటు చరణ్ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయి ఆడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్యూట్ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ ఫ్యాన్స్ బ్లెస్ చేస్తున్నారు . అయితే ఎప్పుడు క్లీంకార ఫోటో షేర్ చేసిన ఫేస్ కనిపించకుండా ఏదో ఒక ఎమోజిని అడ్డుపెట్టే రామ్ చరణ్ – ఉపాసన .. ఈసారి మాత్రం క్లింకార ఫేస్ కు ఎటువంటి అడ్డు పెట్టలేదు . ఫేస్ కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారే తప్పిస్తే ఎక్కడా కూడా ఫేస్ పై ఎమోజిస్ లాంటివి ప్లేస్ చేయలేదు . దీంతో త్వరలోనే క్లింకార ఫోటో రిలీజ్ చేయబోతున్నారు .. ఇదే హింట్ అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు మెగా అభిమానులు . ప్రజెంట్ వైజాగ్లో – చరణ్ – ఉపాసన ఎంజాయ్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news