Moviesబిగ్ బ్రేకింగ్ : రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీ కి గాయాలు.....

బిగ్ బ్రేకింగ్ : రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీ కి గాయాలు.. హాస్పిటల్లో అడ్మిట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ సింగర్ మంగ్లీ కారుకు యాక్సిడెంట్ అయిందంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే తనదైన స్టైల్ లో పాటలు పాడుతూ అభిమానులను మెప్పిస్తూ వచ్చిన సింగర్ మంగ్లీ పలు హిట్ సినిమాలు కూడా మంచి బూస్టప్ ఇచ్చింది .

పలు ఈవెంట్స్ లో కూడా తనదైన స్టైల్ లో పాటలు పాడుతూ వస్తూ ఉంటుంది . రీసెంట్ గా శంషాబాద్ దొండుపల్లి సమీపంలో ఆమె కారు కి యాక్సిడెంట్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే మంగ్లీకి ప్రమాదం తృటిలో తప్పినట్లు తెలుస్తుంది. ఆమె కారును ఓ డి సి ఎం వాహనం ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది.

దీనికి కారణం డిసిఎం డ్రైవర్ మద్యం మత్తులో కారు నడపడమే అంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతూ ఉన్న సమయంలో మంగ్లీ కారుకి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఆమె కారు భారీగా డామేజ్ అయినట్లు సమాచారం అందుతుంది. స్థానికులు సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు . మంగ్లీ తృటిలో ప్రమాదం తప్పుకుంది అని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news