Movies"దాన్ని తిరిగి ఇచ్చేస్తా..గెట్ రెడీ".. చైతన్య సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

“దాన్ని తిరిగి ఇచ్చేస్తా..గెట్ రెడీ”.. చైతన్య సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిహారిక – జొన్నలగడ్డ చైతన్య పేర్లు ఎలా ట్రెండ్ అవుతున్నాయో చూస్తున్నాం . ఈ జంట పెళ్లి చేసుకున్నారు . కానీ వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . సోషల్ మీడియాలో మాత్రం నిహారిక యమ యాక్టివ్గా ఉంటూ పరోక్షంగా చైతన్యకు సంబంధించి ఘాటు కౌంటర్లు వేస్తూ ఉంటుంది .

రీసెంట్ గా కూడా తాను ప్రెసెంటర్ గా వర్క్ చేస్తున్న సాగు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి -డివర్స్ – ఫ్యూచర్ గురించి సంచలన కామెంట్స్ చేసింది . దానికి తిప్పికొడుతూ చైతన్య కూడా “సైలెన్స్ సైలెన్స్” అంటూ భారీ పోస్టు పెట్టుకోవచ్చాడు . రీసెంట్గా చైతన్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులకు షాకింగ్ గా ఉంది . విడాకుల తర్వాత చైతన్య ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు .

సోషల్ మీడియాలోను పెద్దగా ఆక్టివ్ గా ఉండడం లేదు . కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ పోస్టులు పెడుతూ వస్తున్నారు. తాజాగా చైతన్య..” చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయినా తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను .. పాజిటివిటీ పెంచాలి అని అనుకుంటున్నాను “అంటూ రాసుకోచ్చాడు . ఇది చూసిన నెటిజన్స్ నిహారికకు ఇది ఘాటు కౌంటర్ అని పూర్తిగా నెగిటివిటీతో నిండిపోయిన ఆమె మైండ్ లో పాజిటివ్ పెంచాలి అని ఇలా ఇన్ డైరెక్ట్ గా పెట్టుకొస్తున్నాడు పోస్ట్లు అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఈ మాజీ భార్యాభర్తల మధ్య రచ్చరంబోలా మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news