Moviesఅలాంటి వాళ్లకు ఉ* పోయించడానికి...నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడురోయ్..!

అలాంటి వాళ్లకు ఉ* పోయించడానికి…నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడురోయ్..!

సినిమా ఇండస్ట్రీలో వారసులో ఎంట్రీ చాలా కామన్.. తాత పేర్లు తండ్రి పేర్లు చెప్పుకొని చాలామంది ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు . అలా వచ్చిన వాళ్ళు కొంతమంది సక్సెస్ అవుతారు మరి కొంతమంది ఫెయిల్ అవుతారు . కానీ మనలో టాలెంట్ ఉంటే మాత్రం కచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

త్వరలోనే మరి కొంతమంది పిల్లలు కూడా ఎంట్రీ ఇవ్వడానికి బెర్త్లు కన్ఫామ్ చేసుకున్నారు . రీసెంట్గా నందమూరి ఫ్యామిలీ నుంచి మరొక హీరో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అన్న వార్త బాగా వైరల్ గా మారింది . త్వరలోనే నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు . అయితే ఆయన కంటే ముందే మరొక నందమూరి కుర్రాడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది .

ఆయన మరెవరో కాదు నందమూరి హరికృష్ణ మనవడు . నందమూరి హరికృష్ణకు ముగ్గురు కొడుకులు జానకిరామ్ – కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ . కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ హీరోలుగా ఇండస్ట్రీలో రానిస్తున్నారు . జానకిరామ్ నిర్మాతగా మాత్రమే కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు . 2014లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు . ఇప్పుడు ఆయన పెద్ద కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు నందమూరి ఫ్యామిలీకి ఎంతో ఆప్తుడైన వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ మనవడు ఇండస్ట్రీగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . కొంతమంది నందమూరి ఫ్యాన్స్ సరైన హిట్ కొట్టలేకపోతున్న నేటి హీరోలకు ఉ* పోయించడానికి కొత్త హీరోలు రాబోతున్నారు.. వాళ్ళల్లో ఒకరే ఈ కుర్రాడు అంటూ ఓ రేంజ్ లో నందమూరి హరికృష్ణ మనవడిని ట్రెండ్ చేస్తున్నారు . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news