Moviesఆ హీరోయిన్ రిజెక్ట్ చేస్తేనే విశ్వంభరలో త్రిషను బ్రతిమలాడి ఓకే చేశారా..?...

ఆ హీరోయిన్ రిజెక్ట్ చేస్తేనే విశ్వంభరలో త్రిషను బ్రతిమలాడి ఓకే చేశారా..? ఎంత కష్టం వచ్చింది బాసూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ చేస్తున్న మూవీ విశ్వంభర. బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ప్రజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమాను చాలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు వశిష్ట . అంతేకాదు ఈ సినిమాలో రీసెంట్ గా హీరోయిన్ గా త్రిషను కన్ఫామ్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం.

కాగా ఇలాంటి క్రమంలోనే ఓ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నిజానికి విశ్వంభర సినిమాలో ముందుగా చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నారట . అనుష్క శెట్టి – నయనతార – భూమిక ఇలా బోలెడు మంది హీరోయిన్స్ ను చిరంజీవి పక్కన నటింపజేయాలని ఆలోచించారట . అయితే నయనతార – అనుష్క శెట్టి ఈ పాత్ర వినగానే రిజెక్ట్ చేశారట . భూమిక ఈ పాత్రకు బాగా సూట్ అవుతుంది అంటూ వశిష్ట స్పెషల్గా ఆమెను అప్రోచ్ అయి కథ వినిపించాడట .

అయితే భూమిక ఈ కథను రిజెక్ట్ చేసిందట . చాలా టైం ఆమెనే ఈ సినిమాకి ఫైనల్ చేయించడానికి ట్రై చేశారట. కానీ భూమిక అస్సలు ఒప్పుకోలేదట . ఆ తర్వాత త్రిష ను అప్రోచ్ అయ్యారట . మొదట త్రిష కూడా ఒప్పుకోలేదట . ఆ తర్వాత బ్రతిమిలాడి ఎలాగోలా ఓకే చేయించుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి పాత జోడీనే మళ్లీ రిపీట్ చేయబోతున్నాడు వశిష్ట..చూద్దాం ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news