Movies"రాజా సాబ్" సినిమాను వదులుకున్న ఆ అన్ లక్కి హీరో ఎవరో...

“రాజా సాబ్” సినిమాను వదులుకున్న ఆ అన్ లక్కి హీరో ఎవరో తెలిస్తే..షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం. అది అందరి హీరోలకి వర్తిస్తుంది. అయితే మంచి మంచి స్టోరీ ఉన్న సినిమాలు మనం కాకుండా వేరే హీరో చేసి హిట్ కొడితే ఆ బాధ వర్ణాతితం . అలాంటి బాధలు మన ఇండస్ట్రీలో అందరూ అనుభవించారు . రీసెంట్ గా ప్రభాస్ ఆ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాజా సాబ్” సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .

సంక్రాంతి కానుకగా “రాజా సాబ్” సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ప్రభాస్ బ్లాక్ షర్ట్ లో లుంగీ కట్టుకొని ఊర నాటు మాస్ లుక్ లో అదరగొట్టేసాడు . అయితే ఈ సినిమాని మారుతి మొదటగా హీరో నానితో తెరకెక్కించాలనుకున్నారట. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత నాని మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా రావడానికి చాలా ట్రై చేశారట.

కానీ అది కుదరలేదు . అలా ఈ సినిమా ప్రభాస్ చేతికి వెళ్ళింది . ఏ మాటక ఆ మాటే ప్రభాస్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి . దసరా బుల్లోడుల భలే అందంగా ఉన్నాడు అంటున్నారు జనాలు. ఇది ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందట. హర్రర్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ, ఫైట్లు ఉండబోతున్నాయట. అయితే అన్నింటిలోనూ ఫన్‌ మెయిన్‌గా ఉంటుందని తెలుస్తుంది. మారుతి మార్క్ కమర్షియల్‌ మూవీ అంటున్నారు. ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉండబోతుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news