Movies"రాజా డీలక్స్" ని "రాజా సాబ్" గా మార్వడానికి మెయిన్ రీజన్...

“రాజా డీలక్స్” ని “రాజా సాబ్” గా మార్వడానికి మెయిన్ రీజన్ ఇదే ..మన ప్రభాస్ ఇలాంటివి కూడా నమ్ముతాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ఎప్పుడు చూడని ప్రభాస్ ని మనం ఈ సినిమాలో చూడబోతున్నామంటూ ఫస్ట్ లుక్ ఆధారంగా తెలిసిపోతుంది . బ్లాక్ షర్ట్ లో లుంగీలో ప్రభాస్ ఊర నాటు మాస్ గా కనిపిస్తాడు .

కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి మొదటగా రాజా డీలక్స్ అనే పేరుని కన్ఫామ్ చేశారట . కానీ సడన్గా రాజా డీలక్స్ అనే పేరుని రాజసాబ్ గా మార్చేశారట మేకర్స్ . దానికి కారణం ఇదే అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ సలార్ విషయంలో న్యూమరాలజీని నమ్మాడట .అందుకే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

సలార్లో AA పెట్టుకోవడం కారణంగానే ప్రభాస్ కి బాగా లక్ కలిసి వచ్చిందట . అందుకే రాజా డీలక్స్ కాకుండా రాజసాబ్ అనే విధంగా పేరు మార్చి ఇందులో కూడా AA అని లెటర్స్ ను తీసుకొచ్చారు .ఈ విధంగా చూసుకుంటే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని న్యూమరాలజీ ప్రకారం ప్రభాస్ కి బాగా కలిసి వస్తుంది అని ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్ . దీంతో ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news