Movies25 ఏళ్ల యంగ్ కుర్రాడిలా మారిపోయిన మన బాలయ్య.. ఏమున్నాడు రా...

25 ఏళ్ల యంగ్ కుర్రాడిలా మారిపోయిన మన బాలయ్య.. ఏమున్నాడు రా బాబు..!!

నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న సినిమా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి మూవీ లతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూట్ ఎప్పుడు మొదలు పెడుతున్నారో..? ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారో..? అనే విషయం తెలియకుండా దాటేస్తూ వచ్చింది చిత్రం బృందం.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆల్మోస్ట్ 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయిందట . కేవలం రెండు పాటలు మినహా కొన్ని సీన్లు సంబంధించిన సీన్స్ మినహా మిగతా అంతా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేసుకుందట. మొదట ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఇప్పుడు సమ్మర్ కే రిలీజ్ చేసే పనిలో బిజీ అయిపోయిందట చిత్ర బృందం. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ నుంచి ఒక క్రేజీ పిక్ లీక్ అయింది .

ఈ పిక్ లో బాలయ్య యంగ్ కుర్రాడిలా కనిపిస్తూ ఉండడం గమనార్హం. చాలా హ్యాండ్ సమ్ లుక్స్ లో యంగ్ సింహంలా బాలయ్య అదరగొట్టేసాడు. దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి . అచ్చం 25 ఏళ్ల కుర్రాడు లానే ఉన్నాడు బాలయ్య అంటూ నందమూరి ఫ్యాన్స్ పొగడేస్తున్నారు . ఏదో కొత్త ధీమ్ తో తెరకెక్కించాడు ఈ సినిమాను బాబి అన్న విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news