Moviesఓరిఓరి..మన మహేశ్ బాబు సడెన్ గా జర్మనీ వెళ్ళింది అందుకా..? ఏదో...

ఓరిఓరి..మన మహేశ్ బాబు సడెన్ గా జర్మనీ వెళ్ళింది అందుకా..? ఏదో ఎక్స్పెక్ట్ చేశారు కదరా సామీ..!!

మహేష్ బాబు.. రీసెంట్ గానే గుంటూరు కారం అనే సినిమాలో నటించి సగం హిట్ సగం ప్లాప్ టాప్ అందుకని కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మి పడేశారు. రీసెంట్గా మహేష్ బాబు జర్మనీకి వెళ్ళిన విషయం తెలిసిందే . జర్మని అంటే ఏదో వెకేషన్ కో.. ఫామిలీ ట్రిప్పో అనుకున్నారు . కానీ ఆయన సోలో ట్రిప్ వెళ్ళిన తర్వాత ఇది రాజమౌళి సినిమా కోసం వెళ్లిన ట్రిప్ అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు .

త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన ఉంది అంటూ అభిమానులు సంబరపడిపోయారు . సీన్ కట్ చేస్తే జర్మనీ ని వెళ్ళింది మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం కాదు అంటూ తేల్చేసాడు మహేష్ బాబు . తాజాగా చేసిన పోస్ట్ అభిమానుల గుండెలు బద్ధలు అయిపోయేలా చేసింది . మహేష్ బాబు ఒక డాక్టర్ని కలుసుకోవడం కోసం జర్మనీ వెళ్లారట . ఇదే విషయాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

గతంలో ఏప్రిల్ లో అంతకుముందు జూన్లో కూడా మహేష్ బాబు ఆ డాక్టర్ ని కలుసుకున్నట్లు ఫోటోలు ఆధారంగా తెలుస్తుంది. ఇంతకీ మహేష్ బాబు కలిసిన ఆ డాక్టర్ ఎవరు? ఆయన దగ్గర ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ..? అనేక ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చూద్దాం దీని పై మహేశ్ భార్య నమ్రత ఏదైన క్లూ ఇస్తుందేమో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news