Moviesఫైనల్లీ.. పెళ్లికి రెడి అయిన మన ప్రభాస్ హీరోయిన్.. ఏం షాక్...

ఫైనల్లీ.. పెళ్లికి రెడి అయిన మన ప్రభాస్ హీరోయిన్.. ఏం షాక్ ఇచ్చింది గురూ..!

తాప్సి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునింది . ఆ తర్వాత కోలీవుడ్ -బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లో నటిస్తూ బోల్డ్ బ్యూటీగా పాపులర్టీ సంపాదించుకుంది . ప్రియాంక చోప్రా – ప్రీతి జింటా -శ్రేయ శరణ్ తర్వాత ఆ రేంజ్ లో బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోయిన్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు తాప్సి .

బాలీవుడ్ లో తాప్సి బోల్డ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది . ఎప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తాప్సి రీసెంట్గా తన పెళ్లి విషయాన్నీ బయటపెట్టింది. కొన్నాళ్లుగా ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు కూడా నెట్టింట బాగా ట్రెండ్ అయింది . అయితే ఎప్పుడు కూడా తాప్సి తన ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు.

ఫర్ ద ఫస్ట్ టైం 36 ఏళ్ల వయసు గల తాప్సి ప్రియుడిని పరిచయం చేసింది . గత పదేళ్లుగా అతనితో రిలేషన్ లో ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది . డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్స్ బో నీ తాప్సి ప్రేమిస్తుందట . బాలీవుడ్ కి వచ్చిన కొత్తల్లోనే అతనితో పరిచయం ఏర్పడిందట . అలా అది ప్రేమగా మారిపోయిందట . ప్రజెంట్ వీళ్ళు లవ్ లో ఉన్నారట . మాథిస్ తో రిలేషన్షిప్ చాలా సంతోషాన్నిస్తుంది అని ..విడిపోవాలి అని మరొకరిని ప్రేమించాలని ఆలోచన నాకు లేదు అని.. పెళ్లి విషయంలో కొన్ని కొన్ని నిర్ణయాలు ఉన్నాయని.. అవి అంత సెట్ అయ్యాక తన పెళ్లి విషయాన్ని ఓపెన్ గా బయట పెట్టాలి అనుకున్నాను అని చెప్పుకు వచ్చింది. ప్రజెంట్ తాప్సీ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news