Movies"దేవర" కోసం కొరటాలకు ..ఎన్టీఆర్ పెట్టిన ఏకైక కండీషన్ ఇదే..!!

“దేవర” కోసం కొరటాలకు ..ఎన్టీఆర్ పెట్టిన ఏకైక కండీషన్ ఇదే..!!

దేవర.. ఇప్పుడు కోట్లాదిమంది అభిమానుల నోట ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . కానీ అందరి హీరోల ఫ్యాన్స్ కామన్ గా లైక్ చేసే హీరో ఎన్టీఆర్ . ఒక హీరోగా కాకుండా ఒక అన్నలా భావిస్తూ ఉంటారు అభిమానులు. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర నే కావడం గమనార్హం.

ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ ని పెట్టి కొరటాల శివ బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కిస్తున్న సినిమా దేవర . రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది . కాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొరటాలకు ఒకే ఒక్క కండిషన్ పెట్టారట . అందరిలాగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి.. అవార్డులు కొట్టేయాలి.. కచ్చితంగా నాకు మంచి పేరు తీసుకురావాలి అని ఎన్టీఆర్ చెప్పలేదట..

కేవలం ఈ సినిమా నా అభిమానులకి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అంటూ మాత్రమే చెప్పారట . కచ్చితంగా ఇందులో మెసేజ్ ఉంటుంది తారక్ అంటూ కొరటాల శివ ..ఎన్టీఆర్ ని ఒప్పించారట . ఆ కారణంగానే తారక్ ఇన్ని మంత్స్ గ్యాప్ వచ్చిన సినిమా కోసం వెయిట్ చేసాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. చూద్దాం సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news