Moviesరెబల్ ఫ్యాన్స్ కి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..కొంప ముంచేశావ్ కదా...

రెబల్ ఫ్యాన్స్ కి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..కొంప ముంచేశావ్ కదా డార్లింగ్..!

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు గుండె బద్దలైపోయే న్యూస్ అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూసాం. రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులకు పెద్ద తలనొప్పి క్రియేట్ చేస్తుంది. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్ కాళ్ళకి గాయమైంది. ఆ గాయం కారణంగా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాడు ప్రభాస్ .

అంతే కాదు అంతకుముందు బాహుబలి సినిమాల కోసం గంటల తరబడి జిమ్ చేసి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. అయితే చాలాకాలం ప్రభాస్ మోకాలి గాయం ను నెగ్లెట్ చేశాడు . నొప్పి తీవ్రత పెరగడంతో వైద్యులు సర్జరీ సూచించారు . గత ఏడాది ప్రభాస్ విదేశాలలో సర్జరీ కూడా చేయించుకున్నాడు. నెలరోజుల పాటు అక్కడే విశ్రాంతి కూడా తీసుకున్నారు. సలార్ విడుదలకు ముందు కూడా అక్కడే ఉన్నాడు .

అయితే రీసెంట్ గా ప్రభాస్ గాయం మళ్ళీ ఎక్కువైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కల్కి సినిమాకి సంబంధించిన షూటింగ్ ని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారట . మళ్లీ ప్రభాస్ కాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉందట . అందుకే ప్రభాస్ మరోసారి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news