Moviesఅంతా దగ..కుట్ర..మోసం.. ఇంత చీటింగా..!

అంతా దగ..కుట్ర..మోసం.. ఇంత చీటింగా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ క్రియేటివిటీ ఎక్కువైపోతుంది. మరీ ముఖ్యంగా తమకు కావాల్సిన రేంజ్ లో తమ అభిమాన హీరో హీరోయిన్ల ఫ్యామిలీ ఫొటోస్ ని మార్చుకుంటున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో హీరో ప్రభాస్ హీరోయిన్ అనుష్క పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ని క్రియేట్ చేసి ఎలా ట్రెండ్ చేశారో మనం చూసాం. అదే విధంగా రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ ఫోటోలు కూడా క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు .

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. ఏ పండగ వచ్చిన మెగా ఫ్యామిలీ అంతా కలిసి సెలెబ్రేట్ చేసుకుంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే మెగా ఫ్యామిలీ ఈసారి సంక్రాంతి పండుగను బెంగళూరులోని తమ ఫార్మ్ హౌస్ లో బాగా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఫొటోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోవడం గమనార్హం. అకీరా , ఆధ్యా కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకిరా – ఆధ్యా- పవన్ కళ్యాణ్ ఫొటోస్ ని క్రాప్ చేసి ఎడిట్ చేసి కొత్త ఫొటోస్ ని రిలీజ్ చేశారు. ఈ ఫొటోస్ గ్రాఫిక్ అని తెలుస్తున్న సరే చూడడానికి చాలా బాగున్నాయి అంటుంటే మరికొందరు ఇదంతా చీటింగ్ దగా మా పవన్ కళ్యాణ్ ఫొటోస్ ని క్రాప్ చేశారు అంటూ మరికొందరు మండిపడుతున్నారు . మొత్తానికి పవన్ కళ్యాణ్ తన కూతురు కొడుకుతో దిగిన ఫొటోస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news