Moviesబన్నీ ఇంత సెంటి మెంటల్ ఫెలో నా..? వేల కోట్ల ఆస్తి...

బన్నీ ఇంత సెంటి మెంటల్ ఫెలో నా..? వేల కోట్ల ఆస్తి ఉన్నా ఇప్పటికి అలా చేస్తాడా..?

అల్లు అర్జున్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది . అల్లు అరవింద్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నిజానికి అల్లు అరవింద్ కొడుకుగా అల్లు అర్జున్ ఫేమస్ అయ్యాడు అని చెప్పడం కన్నా అల్లు అర్జున్ తండ్రిగా అల్లు అరవింద్ గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పడమే సరైన న్యాయం . గంగోత్రి సినిమా ద్వారా హీరోగా కెరియర్ ప్రారంభించిన బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్నారు.

రీసెంట్గా ఉత్తమ జాతీయ నటుడి అవార్డు అందుకొని తనలోని టాలెంట్ కి సరైన గుర్తింపు అందుకున్న బన్నీ త్వరలోనే గ్లోబల్ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు . పుష్ప2 సినిమాతో కచ్చితంగా బన్నీ బిగ్ హిట్ అందుకోవడమే కాకుండా మరో ఆస్కార్ ఇండియాకి తీసుకురాబోతున్నాడు అన్న ప్రచారం కూడా జరుగుతుంది . కాగా ఇంత పెద్ద స్టార్ హీరో ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు మెమ్యూనరేషన్ తీసుకునే సత్తా ఉన్న ఈ హీరో తన పర్స్ లో మాత్రం ఒక ₹100 నోటును జాగ్రత్తగా దాచుకుంటూ వస్తున్నారట .దానికి సంబంధించిన స్పెషల్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది .

బన్నీ మొదటి నుంచి చాలా సెంటిమెంటల్ ఫెలో.. ప్రతిదీ సెంటిమెంట్ గానే ఫాలో అవుతూ ఉంటాడు . 23 ఏళ్ల ముందు బన్నీకు ఓ డైరెక్టర్ ₹100 నోటు ఇచ్చారట . అది ఎవరో కాదు రాఘవేంద్రరావు గారు . మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పార్టీకి అటెండ్ అయిన అక్కడ అల్లు అర్జున్ డాన్స్ చూసి బాగా ఇంప్రెస్ అయిపోయాడట . అప్పుడే అల్లు అర్జున్ మదర్ ని.. పిలిచి వీడు చాలా పెద్ద హీరో అవుతాడు నీ కొడుకుని నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను అంటూ అడ్వాన్స్ కింద ఈ డబ్బులు తీసుకుంటూ వంద రూపాయలు ఇచ్చారట . ₹100 బన్ని ఇప్పటికీ పదిలంగా దాచుకున్నాడట . బన్నీ కెరియర్ లో ఫస్ట్ సంపాదన ఇదే . ఎన్ని కోట్లు సంపాదించిన వంద రూపాయలు నాకు ప్రత్యేకమని ఎప్పుడు ఆయన 100 రూపాయలు చూసి మురిసిపోతూ ఉంటాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news