Movies"పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రమా..?" వేణు స్వామి పై ప్రభాస్ పెద్దమ్మ సంచలన...

“పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రమా..?” వేణు స్వామి పై ప్రభాస్ పెద్దమ్మ సంచలన కామెంట్స్..!

మనకు తెలిసిందే.. ఆస్ట్రాలజర్ వేణు స్వామి సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఓపెన్ గా చెప్పుకొస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆయన కొన్ని కొన్ని సందర్భాలలో హద్దులు మీరి పోయిన కామెంట్స్ కూడా చేశారు . రీసెంట్గా ప్రభాస్ జాతకం గురించి ఆయన బయటపెట్టిన విషయం తెలిసిందే . ఆయన ఆరోగ్యం బాగోలేదు అని.. పెళ్లి జరగదు అని ..జరిగిన విడాకులు తప్పవు అని ..ఆయనతో సినిమాలను తెరకెక్కించడం వేస్ట్ అని ప్రొడ్యూసర్స్ కి ఉచిత సలహా కూడా ఇచ్చారు .

అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఈ కామెంట్స్ పై స్పందించారు. ” ఆయన మాట్లాడే మాటలు మా కుటుంబానికి ఇబ్బంది కలుగజేస్తున్నాయి ..అసలు ప్రభాస్ జాతకం వాళ్ళ అమ్మగారి దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర లేదు.. అసలు మేము ఇంతవరకు ఆయన జాతకం ఎవరికి చూపించలేదు.. మరి అలాంటిది ప్రభాస్ గురించి ఇలా ఎలా మాట్లాడగలరు..??”.

“ఆయన ఆరోగ్యం బాగోలేదు అంటూ చెబుతున్న మాటలు అవాస్తవం .. కృష్ణం రాజుగారు బ్రతికున్నప్పుడు ఇలాంటివి విన్నప్పుడు .. పిచుక ముందు బ్రహ్మాస్త్రమా వదిలేయండి అనేవారు.. ఇప్పుడు మేము అదే చేస్తున్నాము” అంటూ వేణు స్వామి వ్యాఖ్యలను సునాయాసంగా తిప్పికొట్టింది శ్యామలాదేవి. ప్రజెంట్ ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news